ePaper
More
    HomeతెలంగాణCBSE Syllabus | సీబీఎస్​ఈ పాఠ్యాంశంగా జక్రాన్​పల్లి యువకుడి కవిత్వం

    CBSE Syllabus | సీబీఎస్​ఈ పాఠ్యాంశంగా జక్రాన్​పల్లి యువకుడి కవిత్వం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBSE Syllabus | నిజామాబాద్​ జిల్లా జక్రాన్​పల్లి తండాకు చెందిన యువకుడి కవిత సీబీఎస్​ఈ పాఠ్యాంశం అయింది. జక్రాన్‌పల్లి తండాకు (Jakranpally Thanda) చెందిన రమేశ్‌ కార్తీక్‌ నాయక్‌ తన కవితలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రాసిన ఢావ్లో – గోర్ బంజారా కథలకు 2024 కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించింది.

    రమేశ్​ చిన్ననాటి నుంచి కవితలు రాసేవాడు. గోర్​ బంజరా తెగకు చెందిన ఆయన తన మాతృ భాషతో పాటు, తెలుగు, ఇంగ్లిష్​లో ఎన్నో రచనలు చేశారు. ‘చక్‌మక్‌’ (చెకుముకి రాయి) పేరిట ఆయన ఆంగ్లంలో కవితా సంపుటి వెలువరించారు. ఇందులోని ‘ది రోస్‌ ల్యాండ్‌’ (The Rose Land) కవితను సీబీఎస్‌ఈ బోర్డు ఈ ఏడాది ఎనిమిదో తరగతి ఇంగ్లిష్​ సిలబస్​లో (8th Class English syllabus) పాఠ్యాంశంగా చేర్చింది. కాగా ఈ కవిత బంజారా తెగకు చెందిన తల్లీకొడుకుల జీవన ప్రయాణాన్ని తెలుపుతుంది.

    CBSE Syllabus | ప్రకృతితో అనుబంధం

    రమేశ్​ కార్తీక్​ నాయక్​ ప్రకృతి, బంజారా జీవన విధానంపై ఎక్కువగా కవితలు రాస్తారు. ప్రస్తుతం పాఠ్యాంశంగా చేర్చిన కవిత సైతం ఓ తల్లి మాట వినకుండా ఆమె కుమారుడు సాగించే ప్రయాణాన్ని తెలుపుతోంది. ప్రకృతి ఒడిలో బాలుడి ప్రయాణం, బాల్యంలో చుట్టుముట్టే భయాలు, ఊహా లోకపు మాయలు వివరిస్తుంది. బంజారా తెగ సంస్కృతి (Banjara Tribe Culture), సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉన్న ఈ కవితను పాఠ్యాంశంగా చేరుస్తూ సీబీఎస్​ఈ (CBSE) నిర్ణయం తీసుకుంది.

    CBSE Syllabus | ఎన్నో అవార్డులు

    నిజామాబాద్​ జిల్లాకు (Nizamabad District) చెందిన యువకవి రమేశ్​ కార్తీక్​ నాయక్​ ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఢావ్లో – గోర్ బంజారా కథల సంపుటికి ఏకంగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. ఆయన పదో తరగతి నుంచి కవితలు రాస్తున్నారు. ఆయన రాసిన బల్దేర్‌ బండి కవిత ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంఏ పాఠ్యాంశంగా చేర్చారు. అలాగే ఆంగ్లంలో రాసిన లైఫ్ ఆన్ పేపర్ కవితను కర్ణాటకలోని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పీజీ మొదటి సెమిస్టర్​ ఇంగ్లిష్ పాఠ్యాంశంగా చేర్చింది.

    Latest articles

    Toll Pass | నాలుగు రోజుల్లో 5 లక్షల టోల్​పాస్​లు జారీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Toll Pass | కేంద్ర ప్రభుత్వం ఇటీవల వార్షిక టోల్​పాస్లను (Toll Pass)​ అమలులోకి తెచ్చిన విషయం...

    LIC Jobs | ఎల్‌ఐసీలో ఏఏవో, ఏఈ పోస్టులు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: LIC Jobs | పలు పోస్టుల భర్తీ కోసం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా...

    Vice President candidate | ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ వ్యక్తి.. ప్రకటించిన ఇండి కూటమి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President candidate | విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. తెలంగాణకు...

    Vinayaka Chavithi | వినాయక మండళ్లు నిబంధనలు పాటించాలి: సీఐ

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Vinayaka Chavithi | నగరంలోని వినాయక మండళ్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని పట్టణ సీఐ...

    More like this