అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | జిల్లా కేంద్రంలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి (Multi-Specialty Hospital)లో గుట్టుచప్పుడు కాకుండా ఓ యువతికి అబార్షన్ చేసిన ఘటనలో ఓ పీఎంపీ హస్తం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.
తాడ్వాయి మండలంలోని ఓ యువతికి ఆ గ్రామం పక్కనే ఉన్న పీఎంపీ వైద్యుడు సలహా ఇవ్వడంతోనే ఆమె పట్టణంలోని స్కానింగ్ సెంటర్కు, ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లినట్లు సమచారం. ఈ కేసులో యువతి గర్భానికి కారణమైన యువకుడిపై పోలీసులు పొక్సో కేసు (POCSO Case) నమోదు చేసిన తర్వాత సదరు పీఎంపీని సైతం పోలీస్ స్టేషన్కు మూడు సార్లు విచారణకు పిలిచినట్టుగా తెలిసింది.
Kamareddy | రాజకీయ పలుకుబడితో..
ఈ కేసు తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని ఆర్థికంగా నిలదొక్కుకున్న సదరు పీఎంపీ వైద్యుడు స్థానికంగా తనకు తెలిసిన రాజకీయ నాయకుల చెంతకు చేరినట్టుగా తెలిసింది. సదరు నాయకులు ముఖ్య నేతలకు సమాచారమిచ్చి పీఎంపీపై కేసు కాకుండా వదిలేసేలా చక్రం తిప్పారన్న టాక్ వినిపిస్తోంది. పీఎంపీ వైద్యుడిపై కేసు కాకుండా ఉండేందుకు అతని వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
Kamareddy | కమీషన్ విషయంలో గొడవ మొదలై..
అయితే ఈ ఘటనలో సదరు యువతిని స్కానింగ్ కోసం కామారెడ్డి పట్టణంలోని ఓ స్కానింగ్ సెంటర్ (Scanning Center)కు సదరు పీఎంపీ పంపించాడు. సదరు స్కానింగ్ సెంటర్కు ఏ కేసు పంపించినా అందులో పీఎంపీకి కమీషన్ ఉంటుంది. అయితే ఈ కేసులో సదరు వైద్యుడికి రావాల్సిన కమిషన్ డబ్బును బాధితుల వద్ద తక్కువ తీసుకుని పీఎంపీకి ఇవ్వకపోవడం వల్ల స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు, పీఎంపీకి మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే లింగ నిర్దారణ, ఆ తర్వాత అబార్షన్ కావాల్సిన కేసులకు సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు ఏకంగా రూ.40వేలు ఛార్జ్ చేస్తారని, అందులో ఈ పీఎంపీ వైద్యునికి రూ.18 వేలు కమీషన్ వెళ్తుందని టాక్.
Kamareddy | కేసు నీరుగారిపోతోందా..?
ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ కేసులో రాజకీయ నాయకుల తీవ్ర ఒత్తిడితో సదరు పీఎంపీపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ప్రచారం సాగుతోంది. అయితే అబార్షన్ ఘటనలో అనుకున్నంత విచారణ మాత్రం సాగడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఓ వైపు సదరు ఆస్పత్రి మేనేజ్మెంట్ (Hospital Management) తమపై కేసు కాకుండా పెద్దఎత్తున పైరవీలు చేయడం, పీఎంపీని తరపున పొలిటికల్ ఎంట్రీతో కేసు నీరుగారుతోందన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా రంగంలోకి దిగితే తప్ప అసలు దోషులు బయటపడే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఉన్నతాధికారుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.