అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Narsapur Eco Park | ప్రస్తుత పోటీ ప్రపంచంలో పచ్చని అడవిలో (green forest) ఒకరోజు గడిపితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. దీంతో చాలా మంది ఇతర రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటారు. అలాంటి వారి కోసం తెలంగాణలో అద్భుతమైన ఎకో పార్క్ (eco park) అందుబాటులోకి వచ్చింది.
మెదక్ జిల్లా నర్సాపూర్ అడవిలో (Narsapur forest) ఏర్పాటు చేసిన అర్బన్ ఏకో పార్క్‌కు విశేష స్పందన వస్తోంది. దట్టమైన అడవి.. ఎటు చూసినా పచ్చని చెట్లతో కళకళలాడే ఈ పార్క్‌కు పర్యాటకులు పెరిగారు. అయితే గతంలో వారికి అక్కడ విడిది చేసే అవకాశం ఉండేది కాదు. హైదరాబాద్‌కు (Hyderabad) సమీపంలో ఉండటంతో చాలా మంది అడవి అందాలను తిలకించడానికి వస్తున్నారు. దీంతో ప్రభుత్వం అక్కడ మరిని వసతులు కల్పించింది. నీటి మీద తేలియాడినట్లుండే కాటేజీలు.. ఆకట్టుకునే స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ – మెదక్ నేషనల్ హైవేను (Hyderabad-Medak National Highway) ఆనుకుని నర్సాపూర్ పట్టణ శివారులో అడవి ఉంది. ఒకప్పుడు ఈ మార్గంలో వెళ్లేవారు ఫారెస్ట్ సమీపంలోకి రాగానే భయపడేవారు. అంత దట్టమైన అడవి ఉంటుంది. అయితే బీఆర్ఎస్ హయాంలో ఈ అడవిలో ఎకో పార్క్ ఏర్పాటు చేశారు. రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో నగర వాసులు వారాంతాలు, ఖాళీ సమయాల్లో ఎకో పార్క్‌కు రావడం పెరిగింది.
అయితే ఈ అడవిలో రాత్రి బస చేసే అవకాశం ఉంటే బాగుంటుందని చాలా మంది అభిప్రాయ పడ్డారు. గతంలో ఆ అవకాశం ఉండేది కాదు. ఈ క్రమంలో అటవీ శాఖ ఓ ప్రైవేట్ సంస్థ (private company) ఆధ్వర్యంలో పీపీపీ విధానంలో రూ.3 కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో అందమైన కాటేజీలు నిర్మించింది. అడవిని ఆనుకుని నర్సాపూర్ రాయరావు చెరువు (Narsapur Rayarao Lake) ఉంది. ఈ చెరువు ఒడ్డునే పిల్లర్లు వేసి ఆధునిక హంగులతో కాటేజీలు నిర్మించారు.
Narsapur Eco Park | ఆకట్టుకునేలా..
బర్త్ డే, మ్యారేజ్ డే పార్టీలు, పెళ్లి ముందు నిర్వహించే హల్దీ ఫంక్షన్, గెట్ టు గెదర్ పార్టీలు నిర్వహించుకునేందుకు వీలుగా ఎకో పార్క్‌లో కిచెన్, డైనింగ్ హాల్ సౌకర్యంతో ఫంక్షన్ హాల్ సైతం నిర్మించారు. ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్తో పాటు, పలు కాటేజీల వద్ద చిన్న స్విమ్మింగ్ పూల్‌లను సైతం నిర్మించారు. వీటిని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ (Forest Minister Konda Surekha) శనివారం ప్రారంభించారు. దీంతో పర్యాటకులకు అందుబాటులోకి వచ్చాయి.
Narsapur Eco Park | ఆధునిక హంగులతో..
ఎకో పార్క్‌లో (Eco Park) మొత్తం 42 కాటేజీలు నిర్మించారు. వీటిని ఆధునిక హంగులతో ఏర్పాటు చేయడం గమనార్హం. స్టార్ హోటళ్లలో ఉండే సౌకర్యాలు కల్పించారు. ఆకర్షణీయ మైన క్రోటాన్లు, పూల మొక్కలు పెంచారు. ప్రాంగణంలో పచ్చదనం ఉట్టి పడేలా చెట్లు పెంచారు. రానున్న రోజుల్లో ఒకో పార్క్ మంచి టూరిజం స్పాట్‌గా మారే అవకాశం ఉంది.
🌿 Explore the Serenity of Narsapur Urban Eco Park 🌳
A breathtaking blend of nature, adventure & sustainability, the newly inaugurated Narsapur Urban Eco Park offers lush greenery, scenic trails, eco-cottages & family recreation zones — just minutes from Hyderabad
Experience… pic.twitter.com/3tpGy4YmaI
— IPRDepartment (@IPRTelangana) November 1, 2025
