అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Realme Narzo 90 5G | చైనా కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ (smartphone) తయారీ సంస్థ అయిన రియల్మీ.. భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి (Indian smartphone market) మరో మోడల్‌ను తీసుకువస్తోంది. మిడ్ రేంజ్(Mid range)లో భారీ బ్యాటరీతోపాటు ఫాస్టెస్ట్ చార్జింగ్ సామర్థ్యం గల ఫోన్ ఇదని కంపెనీ పేర్కొంటోంది. డిసెంబర్ 16న విడుదల కానున్న ఈ ఫోన్ అమెజాన్(Amazon)లో అందుబాటులో ఉండనుంది. ఈ మోడల్‌కు సంబంధించి ఆన్లైన్ ప్లాట్‌ఫాంలలో లీక్ అయిన స్పెసిఫికేషన్స్ వివరాలిలా ఉన్నాయి.
Realme Narzo 90 5G | డిస్ప్లే
6.57 inch అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1080 * 2372 పిక్సల్స్ రిజల్యూషన్, ఐపీ/66/68/69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ కలిగి ఉంది. 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది.
Realme Narzo 90 5G | సాఫ్ట్వేర్..
మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం ఆధారిత రియల్మీ యూఐ 6.0 ఓఎస్(OS)తో పనిచేస్తుంది.
Realme Narzo 90 5G | కెమెరా సెటప్..
వెనకవైపు 50 మెగా పిక్సెల్(MP) మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్ అమర్చారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఏఐ ఎడిట్ జినీ, ఏఐ ఎడిటర్ ఫీచర్లున్నాయి.
Realme Narzo 90 5G | బ్యాటరీ సామర్థ్యం..
7000 ఎంఏహెచ్ టైటాన్ బ్యాటరీ అమర్చారు. ఇది 60w ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 143.7 గంటలపాటు మ్యూజిక్ ప్లే లేదా 8.1 గంటలపాటు గేమింగ్ లేదా 24 గంటలపాటు ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంటోంది. ఆరేళ్ల బ్యాటరీ లైఫ్ గ్యారంటీ అని, 1,600 చార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా 80 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని చెబుతోంది.
Realme Narzo 90 5G | వేరియంట్స్..
8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్‌లో టైటానియం కలర్లో అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ. 17,999 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.