అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Motorola Edge 70 5G | చైనాకు చెందిన లెనోవా యాజమాన్యంలో నడుస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ (Smart Phone) తయారీ కంపెనీ అయిన మోటోరోలా నుంచి మిడ్‌రేంజ్‌లో మరొక స్మార్ట్ ఫోన్ వస్తోంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తున్న మోటోరోలా ఎడ్జ్ 70 5జీ(Motorola Edge 70) స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 15న మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తోపాటు మోటోరోలా వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న స్పెసిఫికేషన్ల వివరాలిలా ఉన్నాయి.
డిస్ప్లే : 6.7 ఇంచ్ అమోలెడ్ 1.5కే డిస్ప్లే కలిగిన ఈ ఫోన్.. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1220 * 2712 పిక్సల్స్ రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, IP68, IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ కలిగి ఉంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది.
సాఫ్ట్వేర్ : స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం ఆధారిత మోటో హలో యూఎక్స్ ఓఎస్‌తో పనిచేస్తుంది. మూడేళ్లపాటు ఓఎస్, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
Motorola Edge 70 5G | కెమెరా సెటప్
వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఇచ్చారు. దీంతో 4కే వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
Motorola Edge 70 5G | బ్యాటరీ సామర్థ్యం
5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల సిలికాన్ కార్బన్ బ్యాటరీని అమర్చారు. ఇది 68 వాట్ టర్బో చార్జింగ్, 15 వాట్ వైర్ లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 31 గంటలపాటు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. వేపర్ కూలింగ్ చాంబర్ కలిగి ఉంది.
వేరియంట్ : ఈ మోడల్ గ్యాడ్జెట్ గ్రే, బ్రాన్జ్ గ్రీన్, లిల్లీ ప్యాడ్ కలర్స్‌లో లభిస్తుంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,990.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది.