అక్షరటుడే, ఎల్లారెడ్డి : Cyber Crime | బిజినెస్ యాప్ ద్వారా ఓ వ్యక్తి మోసపోయాడు. ఏకంగా రూ.18.50 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలంలోని (Yellareddy Mandal) మాచాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మాచాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 2025 నవంబర్ నెలలో ఫేస్బుక్లో ఓ యువతి పరిచయమైంది. ఈ సమయంలో ట్రేడింగ్ గురించి ఆ యువతి కొన్ని సూచనలు ఇచ్చి లాభాలు వస్తాయని ఆ వ్యక్తికి నమ్మబలికింది. ఆ అమ్మాయి మాటలను నమ్మిన ఆ వ్యక్తి నవంబర్ నెలలోనే ఆమె సూచించిన బిజినెస్ యాప్‌లో (Business App) రెండు దఫాలుగా రూ.50 వేలు, రూ.30 వేలు పెట్టుబడి పెట్టాడు.
Cyber Crime | లాభం ఆశ చూపి..
బిజినెస్ యాప్‌లో పెట్టుబడి పెట్టిన అనంతరం ఒకేరోజు రూ.5వేల లాభం వచ్చిందని సదరు యువతి చెప్పింది. దీంతో పూర్తిగా ఆమె మాటలు నమ్మిన ఆ వ్యక్తి దఫదఫాలుగా బిజినెస్ షాప్‌లో డబ్బులను పెట్టుబడిగా పెట్టాడు. యాప్‌లో 18.50 లక్షలు పెట్టుబడి పెరిగే సరికి, రూ.18 లక్షల లాభం ఆ వ్యక్తికి యాప్‌లో కనిపించింది. దీంతో సదరు వ్యక్తి రూ.65వేల డ్రా చేసేందుకు ప్రయత్నించగా డ్రా కాలేదు. దీంతో ఆ యువతిని సంప్రదించగా 24గంటల్లో డబ్బులు వస్తాయని.. లేకపోతే కస్టమర్‌కేర్‌ను సంప్రదించాలని సూచించింది. కస్టమర్ కేర్‌ను సంప్రదించగా ఇంకా రూ.22 లక్షలు కడితేనే డ్రా చేయడానికి వీలవుతుందని వారు తెలిపారు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన వ్యక్తి వెంటనే సైబర్ క్రైం (Cybercrime Police) పోలీసులకు సమాచారం అందించాడు. కాగా పోలీసులు ఆన్లైన్ మోసాలపై (Online Scams)ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజలు అత్యాశకు పోయి మోసపోతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.