అక్షరటుడే, వెబ్డెస్క్ : Switzerland | న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations) వేళ స్విట్జర్లాండ్లో విషాదం చోటు చేసుకుంది. ఓ బార్లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు.
క్రాన్స్ మోంటానా (Crans Montana) పట్టణంలోని ఓ బార్లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో అనేక మంది మరణించారని, చాలా మంది గాయపడ్డారని అధికారులు గురువారం తెలిపారు. వాలైస్ నైరుతి ఖండంలోని పోలీసులు తెల్లవారుజామున పేలుడు సంభవించిందని, దీనికి కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదని పోలీసులు (Switzerland Police) ధృవీకరించారు. ఈ సంఘటన ఫలితంగా అనేక మంది ప్రాణనష్టం సంభవించిందని, వాటిలో మరణాలు కూడా సంభవించాయని పోలీసు ప్రతినిధి గేటన్ లాథియోన్ పేర్కొన్నారు.
Switzerland | కొనసాగుతున్న దర్యాప్తు
స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:30 గంటలకు లే కాన్స్టెలేషన్ బార్ (Le Constellation Bar)లో పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. పేలుడుతో బార్ ఉన్న భవనంలోని కొంత భాగాన్ని మంటలు చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పివేశాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. రక్షణ, దర్యాప్తు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా ఘటన సమయంలో బార్లో 100 మందికి పైగా ఉన్నారు.