అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Himachal Pradesh | హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ పేలుడు చోటు చేసుకుంది. సోలన్ జిల్లా (Solan District)లోని నాలాగఢ్ పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీస్ స్టేషన్ (Nalagarh Police Station) సమీపంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. దాని ప్రభావం వందల మీటర్ల దూరం వరకు ఉంది. పేలుడు ధాటికి దెబ్బతిన్న పోలీస్ స్టేషన్, ECHS పాలీక్లినిక్, మార్కెట్ కమిటీ భవనం కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, పేలుడుకు గల కారణాన్ని గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులను తెలిపారు.
Himachal Pradesh | ఉలికిపాటు
నూతన సంవత్సర వేడుకల (New Year Celebrations) మొదటి రోజున పేలుడు చోటు చేసుకుంది. దీంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పేలుడు శబ్దం 400-500 మీటర్ల దూరం వరకు వినిపించినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు సంఘటనా స్థలాన్ని మూసివేశారు. ఎస్పీ బడ్డీ వినోద్ ధీమాన్ (SP Buddy Vinod Dhiman), ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే పేలుడుకు కారణమేమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోగా.. స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు. దీనిపై వారు మాట్లాడుతూ… సమీపంలో కూర్చుని ఉన్నప్పుడు పేలుడు సంభవించిందని, ఆ ప్రాంతమంతా కుదుపుకు గురైందని ఓ వ్యక్తి చెప్పాడు. మరొక కార్మికుడు అకస్మాత్తుగా ఏమీ చూడలేకపోయానని, భవనం పెద్ద గాజు అద్దాలు పగిలిపోయాయని చెప్పాడు.
Himachal Pradesh | స్పందించిన సీఎం
సిమ్లాలోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు (CM Sukhwinder Singh Sukhu) స్పందించారు. పేలుడుకు సంబంధించి పోలీసు శాఖ నుంచి సమాచారం కోరినట్లు తెలిపారు. ఆర్మీ ఆసుపత్రి వైద్య అధికారి డాక్టర్ వాలిద్ షా మాట్లాడుతూ, తాను OPDలో కూర్చున్నప్పుడు పేలుడు శబ్దం వినిపించిందని తెలిపారు. పేలుడు కారణంగా ఆసుపత్రిలోని తొమ్మిది కిటికీలు, తలుపులు పగిలిపోయాయి.