అక్షరటుడే, భీమ్‌గల్: Mendora | శ్రీరాంసాగర్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. పోలీసులు అతడిని రక్షించారు. ఈ ఘటన మెండోరా మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వర్ని మండలం అంతాపూర్ తండాకు చెందిన బొంతు మహేష్ కనిపించడం లేదని పేర్కొంటూ స్థానిక పోలీసుస్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది.
కాగా.. ఆయన పోచంపాడ్ ప్రాజెక్టులో ఆత్మహత్య చేసుకోవడానికి వస్తున్నాడని మెండోరా మండల ఎస్సై జాదవ్ సుహాసిని సమాచారం అందుకున్నారు. వెంటనే తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రాజెక్టుకు వెళ్లే అన్ని రోడ్లపైనా తనిఖీలు చేపట్టారు. పోచంపాడ్ ఎక్స్ రోడ్డు వద్ద మహేశ్‌ను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్టేషన్‌కు తరలించి, కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబసభ్యులను పిలిపించి వారికి అప్పజెప్పారు.