అక్షరటుడే, నిజాంసాగర్: Nizamabad GGH | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. అర్ధరాత్రి తర్వాత సదరు వ్యక్తి ఆస్పత్రిలో ఉరివేసుకుని సూసైడ్‌కు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. జుక్కల్ మండలంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన పొనుగంటి సాయిలు(37) భార్య సంగీత ఈ నెల 6న నిజామాబాద్ ఆస్పత్రిలో డెలివరీ అయ్యింది. కాగా.. వారికి కుమారుడు జన్మించి మృతి చెందాడు. అయితే సంగీత పల్స్ రేట్ పడిపోవడంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా.. భార్య ఆస్పత్రిలో ఉండగా చేతిలో డబ్బులు లేకపోవడం.. అప్పటికే ఇతరుల వద్ద తీసుకున్న అప్పు ఎలా చెల్లించాలో తెలియకపోవడంతో పాటు మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు.