Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన కామారెడ్డి మండలం(Kamareddy mandal) చిన్నమల్లారెడ్డి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మదాం సంజీవ్(34) డ్రైవర్​గా పని చేస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన సంజీవ్ శుక్రవారం ఎలుకల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి (GGH kamareddy) జీజీహెచ్​కు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సంజీవ్​ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.