Homeజిల్లాలుకామారెడ్డిBanswada RTC | ఆర్టీసీ బస్టాండ్‌లో తప్పిన పెను ప్రమాదం.. పెచ్చులూడిపడడంతో ఆందోళన చెందిన ప్రయాణికులు

Banswada RTC | ఆర్టీసీ బస్టాండ్‌లో తప్పిన పెను ప్రమాదం.. పెచ్చులూడిపడడంతో ఆందోళన చెందిన ప్రయాణికులు

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada RTC | బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌లోని (RTC Bus stand) క్యాంటీన్‌లో శుక్రవారం పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. క్యాంటీన్​లో మధ్యాహ్నం పైకప్పు పెచ్చులు ఒక్కసారిగా ఊడి పడ్డాయి.

అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు (RTC passengers), సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పైకప్పు పెచ్చులు పడిపోవడంతో క్యాంటీన్‌లోని సామాగ్రి దెబ్బతింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్టాండ్‌లోని పాత భవనాలకు తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Banswada RTC | శిథిలావస్థకు చేరిన భవనాలు..

కొన్నేళ్ల క్రితం నిర్మించిన ఆర్టీసీ భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో సిబ్బంది సైతం ఆ భవనాల్లో భయపడుతూనే విధులు నిర్వహిస్తున్నారు. అలాగే వర్షాకాలంలో పురాతనమైన బస్టాండ్లలో నిలబడేందుకు కూడా ప్రయాణికులు జంకుతున్నారు. ఎప్పుడు ఏ కప్పు పెచ్చులు ఊడిపడతాయోనని భయపడుతున్నారు. అధికారులు స్పందించి బస్టాండ్ల కోసం కొత్త భవనాలు నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.