Homeజిల్లాలుకామారెడ్డిRajampet mandal | తృటిలో తప్పిన పెను ప్రమాదం.. గ్యాస్​ ట్యాంకర్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Rajampet mandal | తృటిలో తప్పిన పెను ప్రమాదం.. గ్యాస్​ ట్యాంకర్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Rajampet mandal | గ్యాస్ ట్యాంకర్​ను ఆర్టీసీ బస్సు వెనుకనుండి ఢీకొట్టింది. ఈ ఘటన రాజంపేట మండలం (Rajampet mandal) పొందుర్తి శివారులోని జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ డిపో–1కు (Nizamabad Depot-1) చెందిన ఆర్టీసీ బస్సు సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తోంది. అదే దారిలో మహారాష్ట్రకు (Maharashtra) చెందిన హెచ్​పీ గ్యాస్ ట్యాంకర్​ నిజామాబాద్​ వైపే వెళ్తోంది. అయితే పొందుర్తి శివారులో ట్యాంకర్​ను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

ట్యాంకర్​ను అతివేగంగా ఢీకొన్న ఆర్టీసీ బస్సు (RTC bus) అనంతరం డివైడర్​ను దాటి అవతలి వైపు రోడ్డుపైకి వెళ్లింది. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. దీంతో తీవ్రంగా ఆందోళనకు గురైన ప్రయాణికులు వెనుకవైపు ఉన్న అత్యవసర డోర్ ద్వారా (passengers) కిందకు దిగారు. ట్యాంకర్ పేలి ఉంటే ఊహించని ప్రమాదం సంభవించేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.