అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Collectorate | కలెక్టరేట్లోనే మహిళలకు రక్షణ కరువైంది. ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులకు భద్రత లేకుండా పోయింది. ఓ కామాంధుడి ఆకృత్యాలకు మహిళా సిబ్బంది (Female staff) విధులకు వెళ్లడానికే భయపడుతున్నారు.
హన్మకొండ కలెక్టరేట్లో (Hanmakonda collectorate) మహిళా సిబ్బందిపై ఓ అధికారి అత్యాచార యత్నం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కలెక్టరేట్లోని ఎస్టాబ్లిష్మెంట్ లో ఇర్ఫాన్ సోహైల్ అనే వ్యక్తి సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు.
ఆయన ఇటీవల తోటి ఉద్యోగిపై అత్యాచార యత్నం చేశాడు. నిందితుడి నుంచి తప్పించుకున్న బాధితురాలు సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు అతడిపై లైంగిక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో సోహెల్‌ను కలెక్టర్ సస్పెండ్ (suspended) చేశారు.
Collectorate | తీవ్ర కలకలం..
సాధారణంగా ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవడానికి కలెక్టర్ దగ్గరకు వస్తారు. కలెక్టరేట్లో తమకు న్యాయం జరుగుతుందని నమ్ముతారు.
అయితే కలెక్టరేట్లో పని చేసే ఉద్యోగులకు రక్షణ లేకుండా పోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ సీనియర్ అసిస్టెంట్ ఏకంగా తోటి ఉద్యోగిపై అత్యాచార యత్నం చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా సదరు ఉద్యోగికి ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇర్ఫాన్ కొన్నేళ్లుగా మహిళా సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు (strict action) తీసుకోవాలని ఉద్యోగులు, ప్రజలు కోరుతున్నారు.