Homeటెక్నాలజీDrones | పిట్ట కొంచెం.. కూత ఘనం..చిన్న డ్రోన్‌ ఎంత పనిచేస్తోందంటే!

Drones | పిట్ట కొంచెం.. కూత ఘనం..చిన్న డ్రోన్‌ ఎంత పనిచేస్తోందంటే!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Drones | పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా.. చూడడానికి చిన్నగా ఉండే డ్రోన్లు(Drones) పెద్దపెద్ద పనులలో సహాయం చేస్తున్నాయి. పెళ్లి మండపాల నుంచి యుద్ధ భూమిదాకా అన్ని రంగాల(All sectors)లో కీలక భూమిక పోషిస్తున్నాయి. మొదట్లో వీటిని ఫొటోలు(Photos) తీయడానికి ఉపయోగించేవారు. అనంతర కాలంలో వీటి సేవలు ఇతర రంగాలకూ విస్తరించాయి. ప్రస్తుతం ఫొటోగ్రఫీ(Photography)తోపాటు వ్యవసాయ రంగంలోనూ విశేషంగా వినియోగిస్తున్నారు. డెలివరీలకూ వాడుతున్నారు. యుద్ధభూమిలోనూ డ్రోన్‌ల పాత్ర గణనీయంగా పెరిగింది.

Drones | కొత్త ఆవిష్కరణలతో..

డ్రోన్ల(అన్‌మ్యాన్‌డ్‌ ఏరియల్‌ వెహికల్స్‌) వినియోగం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. కొత్త ఆవిష్కరణలతో ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతోంది. ఆధునిక సాంకేతికత(Latest technology)తో వివిధ రంగాలలలో విస్తృతంగా ఉపగించబడుతున్నాయి. ఇప్పటికే వ్యవసాయ(Agriculture) రంగంలో వీటి వినియోగం పెరిగిన విషయం తెలిసిందే.. పంటలపై పురుగు మందులు పిచికారీ చేయడానికి ఉపయోగిస్తున్నారు.

Drones | విపత్తుల సమయంలో..

భూకంపం(Earthquake), వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తులు సంభవించినప్పుడు నష్టాన్ని అంచనా వేయడానికి, పరిస్థితిని తెలుసుకోవడానికి డ్రోన్లను వాడుతున్నారు. బాధితులను గుర్తించి, సహాయం అందించడానికి కూడా ఇవి దోహదపడుతున్నాయి. రిమోట్‌ ప్రాంతాల(Remote areas)లో వైద్య సేవలకూ వీటిని వాడుతున్నారు. ఏరియల్‌ సర్వకూ ఉపయోగపడుతున్నాయి.

Drones | రక్షణ రంగంలో..

రక్షణ రంగం(Defence sector)లోనూ డ్రోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ఇవి ఆయుధాలుగానూ ఉపయోగపడుతున్నాయి. గూఢచర్యం, సరిహద్దుల్లో నిఘా, భద్రత కార్యకలాపాలకు సంబంధించి రియల్‌ టైమ్‌ డాటా సేకరించడానికి డ్రోన్లను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్‌(Traffic), శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ సైతం వీటి సేవలను వినియోగించుకుంటోంది.

Drones | సరుకుల డెలివరీకి సైతం..

ప్రస్తుత డ్రోన్లు చిన్నచిన్న వస్తువులనే కాదు.. వంద కిలోల బరువున్నవాటినీ మోసుకెళ్లగలవు. ట్రాఫిక్‌ ఇబ్బందులతో వస్తువుల డెలివరీలు(Delivery) ఆలస్యం అవుతుండడంతో కర్ణాటకలోని బెంగళూరులో డ్రోన్లను ఉపయోగించి వస్తువుల డెలివరీ కూడా చేస్తున్నారు.