అక్షరటుడే, లింగంపేట : leopard in lingampet | కామారెడ్డి జిల్లాలో (Kamareddy) ఓవైపు పెద్దపులి భయాందోళనకు గురిచేస్తోంది. కాగా.. మరో వైపు లింగంపేటలో ఓ చిరుత లేగదూడపై దాడి చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
లింగంపేట మండలం మోతె గ్రామంలో (Mothe Village) చిరుత సంచరించింది. రాత్రివేళ గ్రామానికి చెందిన గొల్ల మల్లేశ్‌కు చెందిన లేగదూడపై దాడి చంపేసినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాత్రి సమయంలో పంట కాపులకు రైతులు వెళ్తారని.. చిరుత సంచరించడంతో భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు.
leopard in lingampet | గ్రామానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది..
లేగదుడపై చిరుత దాడి చేయడంతో అటవీశాఖ (Forest Department) సిబ్బంది గ్రామానికి చేరుకుని ఆనవాళ్లను సేకరించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎఫ్ఆర్వో చరణ్ (Yellareddy FRO Charan) మాట్లాడుతూ.. గ్రామ శివారులో పెద్దపులి సంచరిస్తున్నట్లు వదంతులు వస్తున్నాయన్నారు. పెద్దపులి కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో సంచరిస్తుందని, దానిని ట్రాక్ చేయడానికి ఆరురుగు సిబ్బంది ప్రత్యేకంగా పులి వేటలోనే ఉన్నట్లు తెలిపారు. రైతులు ఈ వదంతులను నమ్మవద్దని సూచించారు.