అక్షరటుడే, ఇందూరు : Nominations in Nizamabad | నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. అభ్యర్థులు నామినేషన్లకు చివరిరోజైన శుక్రవారం భారీగా పత్రాలు దాఖలు చేశారు. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో సెంటర్ల వద్ద సందడి కనిపించింది.
Nominations in Nizamabad | చివరి రెండు రోజుల్లోనే..
ఆర్మూర్, భీమ్గల్, బోధన్ మున్సిపాలిటీ (Bodhan Municipality)లతో పాటు నిజామాబాద్ నగర పాలక సంస్థలో మొత్తం మూడు రోజుల్లో 1,729 నామినేషన్లు స్వీకరించారు. బోధన్ మున్సిపాలిటీలో తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయని అభ్యర్థులు.. చివరి రెండు రోజుల్లో 342 నామినేషన్లను అందజేశారు. ఇందులో కాంగ్రెస్ 112 మంది, బీఆర్ఎస్ 90, ఎంఐఎం 62, బీజేపీ 43, బీఎస్పీ 4, ఆప్, సీపీఎం చెరో రెండు, ఇతర రిజిస్టర్డ్ పార్టీలు 8, స్వతంత్రులు 19 మంది నామినేషన్లను దాఖలు చేశారు.
Nominations in Nizamabad | భీమ్గల్ మున్సిపాలిటీలో..
భీమ్గల్ మున్సిపాలిటీ (Bheemgal Municipality)లో చివరిరోజు శుక్రవారం 84 నామినేషన్లు స్వీకరించారు. మూడు రోజులు కలిపి 113 నామినేషన్లను ఆయా పార్టీల అభ్యర్థులు వేశారు. ఇందులో కాంగ్రెస్ నుంచి 39 మంది, బీజేపీ 28, బీఆర్ఎస్ 27, బీఎస్పీ 5, ఇతర రిజిస్టర్డ్ పార్టీలు 4, స్వతంత్రులు పదిమంది నామినేషన్లు దాఖలు చేశారు.
Nominations in Nizamabad | ఆర్మూర్ మన్సిపాలిటీలో..
ఆర్మూర్ మున్సిపాలిటీ (Armoor Municipality)లో చివరి రోజు 232 నామినేషన్లను స్వీకరించారు. మొత్తం మూడు రోజులు కలిపి 298 మంది అభ్యర్థులు ఆయా పార్టీల నుంచి నామినేషన్లను వేశారు. ఇందులో కాంగ్రెస్ నుంచి 114 మంది, బీజేపీ నుంచి 73, బీఆర్ఎస్ 65, ఎంఐఎం 7, బీఎస్పీ 5, ఆప్ నుంచి 4, సీపీఎం ఒకటి, ఇతర రిజిస్టర్డ్ పార్టీలు నుంచి 4, స్వతంత్రులు 25 మంది ఉన్నారు.
Nominations in Nizamabad | నగర పాలక సంస్థలో ..
నిజామాబాద్ నగర పాలక సంస్థలో మూడు రోజుల్లో 976 నామినేషన్లను స్వీకరించారు. ఇందులో కాంగ్రెస్ (Congress) నుంచి 319, బీజేపీ నుంచి 253, బీఆర్ఎస్ నుంచి 120, ఎంఐఎం నుంచి 79 మంది, బీఎస్పీ 5, సీపీఎం 5, ఆప్ 3, టీడీపీ 2, ఇతర రిజిస్టర్డ్ పార్టీల నుంచి 72, స్వతంత్రులు 118 మంది నామినేషన్లను దాఖలు చేశారు.