అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | హైదరాబాద్‌లో ఇటీవల ‘నివేశక్ శివిర్’ (Niveshak Shivir) జరిగింది. చెల్లించబడని డివిడెండ్లు, క్లెయిమ్ చేయని షేర్లను రీక్లెయిమ్ చేసుకోవడంలో షేర్‌హోల్డర్లకు (shareholders) సహాయం అందించేందుకు ఈ ప్రోగ్రాం నిర్వహించారు.
దీని ద్వారా వ్యవస్థలో అన్‌క్లెయిమ్డ్ ఇన్వెస్టర్ అసెట్స్ పరిమాణాన్ని తగ్గించడంతో పాటు తమ పెట్టుబడులను పరిరక్షించుకోవడంలో ఇన్వెస్టర్లకు సాధికారత కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలో సీడీఎస్ఎల్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (సీడీఎస్ఎల్ ఐపీఎఫ్), బీఎస్ఈ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (బీఎస్ఈ ఐపీఎఫ్) కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఎన్ఎస్‌డీఎల్‌లాంటి దిగ్గజ మార్కెట్ ఇన్‌ఫ్రా సంస్థలతో (major market infrastructure institutions) పాటు కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్, బిగ్‌షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, పూర్వా షేరిజిస్ట్రీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, MUFG ఇన్ఫోలైన్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు.
Hyderabad | నివేశక్ శివిర్ ఎందుకంటే..
సమగ్రమైన సహకారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా 23 సర్వీస్ డెస్కులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏమి చేశారంటే..
- ఆరేళ్లుగా క్లెయిమ్ చేయబడకుండా ఉన్న డివిడెండ్లు, షేర్లను క్లెయిమ్ చేయడం
- అప్పటికప్పుడు కేవైసీ, నామినేషన్ వివరాలను ఆన్-ది-స్పాట్ అప్‌డేట్ చేయడం
- క్లెయిమ్-సంబంధ సందేహాలను సత్వరం పరిష్కరించడం
- IEPFAకి సమర్పించిన పెండింగ్ క్లెయమ్‌లను ప్రాసెస్ చేయడం
రోజంతా సాగిన కార్యక్రమంలో హైదరాబాద్, సమీప ప్రాంతాలకు చెందిన 360 మందికి పైగా ఇన్వెస్టర్లు, క్లెయిమెంట్లు పాల్గొన్నారు. వీరిలో విద్యార్థులు, ఎంట్రప్రెన్యూర్లు, రిటైల్ ఇన్వెస్టర్లు, కార్పొరేట్ ప్రొఫెషనల్స్ మొదలైనవారు ఉన్నారు.
ఐఈపీఎఫ్ఏ సీఈవో, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి అనిత షా ఆకెళ్ల, సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీవన్ సోన్‌పరోటే (Jeevan Sonparote), సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ జయవంత్ కదమ్, ఐఈపీఎఫ్ఏ జనరల్ మేనేజర్ Lt. Col ఆదిత్య సిన్హా, సెబీ జనరల్ మేనేజర్ బినోద్ శర్మ, సీడీఎస్ఎల్ ఐపీఎఫ్ సెక్రటేరియట్ హెడ్ సుధీష్ పిళ్లై; బీఎస్ఈ ఐపీఎఫ్ కిరణ్ పాటిల్‌తో పాటు సెబీ, ఐఈపీఎఫ్ఏ, ఎంఐఐలు, ఆర్‌టీఏల నుంచి ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీడీఎస్ఎల్ రూపొందించిన ఇన్వెస్టర్ గైడ్‌ను ఇతర ఎంఐఐలతో కలిసి ఐఈపీఎఫ్ఏ మరియు సెబీ ఆవిష్కరించాయి. క్లెయిమ్స్ ప్రక్రియకు సంబంధించి ఇన్వెస్టర్లు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఇది సహాయకరంగా ఉంటుంది.
రోజు మొత్తం మీద, అన్‌క్లెయిమ్డ్ ఇన్వెస్టర్ అసెట్స్ సమస్యను పరిష్కరించడంపై ప్రధానంగా దృష్టి పెట్టబడింది. క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు, ఆత్మనిర్భర్ ఇన్వెస్టర్లకు సాధికారత కల్పించేందుకు, వారిలో అవగాహన పెంపొందించేందుకు అవసరమైన సహాయాన్ని, వనరులను సెబీ, ఐఈపీఎఫ్‌ఏ (SEBI and IEPFA) సంయుక్తంగా అందించాయి.