అక్షరటుడే,కోటగిరి : Kotagiri Mandal | ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని భారంగా అనుకోకుండా భరోసాగా భావించాలని ఎస్సై సునీల్ (SI Sunil) తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా.. పోతంగల్ మండల కేంద్రంలోని రోడ్డు భద్రతపై అవగాహన హెల్మెట్‌తో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బస్టాండ్ నుంచి చెక్‌పోస్ట్ వరకు సాగింది.
Kotagiri Mandal | ఇంట్లోవాళ్లు ఎదురుచూస్తుంటారని..
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మన కోసం మన ఇంటి వాళ్లు ఎదురు చూస్తుంటారని అనుక్షణ మదిలో గుర్తు పెట్టుకుని వాహనం నడపాలని సూచించారు. హెల్మెట్ (Helmet) ధరించడం వల్ల అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను (Road Accidents) నివారించడానికి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ అనేది కేవలం ఒక వస్తువు కాదని ప్రాణాలను కాపాడే భద్రత కవచం అని సూచించారు.
Kotagiri Mandal | డ్రైవింగ్ లైసెన్స్ ఉంచుకోవాలి..
వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) కలిగి ఉండాలని, వాహనానికి సంబంధించిన పత్రాలు వెంట తీసుకెళ్లాలని ఎస్సై కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, గులాం నబీ, బీజేపీ మండల అధ్యక్షుడు బజరంగ్ (హన్మాండ్లు), ఏఎస్సై బన్సీలాల్, యాదగిరి, అరుణ్ కుమార్, అజ్మత్, ఓమన్నా పటేల్, వాహనదారులు, తదితరులు పాల్గొన్నారు.