అక్షరటుడే, ఇందూరు : Kakatiya Institutions | వినాయకచవితి (Vinayaka Chavithi) సందర్భంగా జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బుధవారం జరుపుకునే చవితి వేడుకకు గణనాథులను మండపాలకు భక్తులు తరలిస్తున్నారు.
Kakatiya Institutions | కాకతీయ విద్యాసంస్థల్లో..
వినాయక చవివి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కాకతీయ విద్యాసంస్థల్లో (Kakatiya Educational Institutions) ఏర్పాట్లు నిర్వహించారు. దీంట్లో భాగంగా మంగళవారం విఘ్నేశ్వరుడిని తమ విద్యాసంస్థల్లోకి ఘనంగా స్వాగతం పలికారు. గణనాథుడిని తీసుకొచ్చే శోభాయాత్రలో విద్యార్థుల చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. గణపతి ఊరేగింపు నిర్వహించే వాహనం (Ganapati Vehicle) ఎదుట చిన్నారులు రంగురంగుల దుస్తులు ధరించి యాత్రలో ఉత్సాహంగా నృత్యాలు చేశారు. అనంతరం వినాయకుడి పాటలు పాడుతూ గంగా క్యాంపస్(Ganga Campus)లో లంబోధరుడిని తీసుకువెళ్లారు. అనంతరం విద్యాసంస్థల డైరెక్టర్లు రజనీకాంత్(Rajinikanth), తేజస్విని(Tejaswini), రామోజీరావు(Ramoji Rao) ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు విద్యార్థులకు ఆయా అంశాల్లో పోటీలు ఏర్పాటు చేశారు. దీంతో పాఠశాల ప్రాంగణం కోలాహలంగా మారింది.
