Homeజిల్లాలునిజామాబాద్​Ura Panduga | ఘనంగా ఊర పండుగ.. ప్రారంభమైన గ్రామదేవతల ఊరేగింపు

Ura Panduga | ఘనంగా ఊర పండుగ.. ప్రారంభమైన గ్రామదేవతల ఊరేగింపు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : Ura Panduga | ఇందూరు (Induru) నగరంలో ఊర పండుగ ఘనంగా ప్రారంభమైంది. పోతురాజుల విన్యాసం ఆకట్టుకుంటుంది. పాడి పంటలు.. పిల్లా జెల్ల ఆయురారోగ్యాలతో ఉండాలని ఇందూరు ప్రజలు ప్రతి ఏటా ఊర పండుగను ఘనంగా నిర్వహిస్తారు. నగరంలోని ఖిల్లా శారదాంబా గద్దె నుంచి దేవతల ఊరేగింపును ప్రారంభించారు.

అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Suryanarayana) తో పాటు సర్వసమాజ్ కమిటీ కన్వీనర్ యెండల లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ ప్రవీణ్, ఏసీపీ రాజా వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. గాజుల్ పేట్ వద్ద “సరి”ని వేసి భక్తులకు అందజేస్తున్నారు. పెద్ద బజార్ నుంచి వినాయక్ నగర్, మహాలక్ష్మి నగర్ వరకు ఒక ఊరేగింపు.. నెహ్రూ పార్క్ మీదుగా దుబ్బ వరకు మరో ఊరేగింపు కొనసాగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్​ నాయకుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

గ్రామ దేవతలకు పూజలు చేస్తున్న ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా

పూజలు చేస్తున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​

ఊరేగింపులో పాల్గొన్న భక్తులు

పోతురాజుల విన్యాసాలు

బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు

Must Read
Related News