ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Teachers Day | గురువులకు ఘనంగా సన్మానం..

    Teachers Day | గురువులకు ఘనంగా సన్మానం..

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Teachers Day | ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించి, వారి సేవలను కొనియాడారు.

    నగరంలోని డాక్టర్ దేవిదాస్ భవన్​లో (Devidas Bhavan) శనివారం ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 74 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

    కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశాలి సంఘం(Padmasali sangham) జిల్లా గౌరవాధ్యక్షుడు దీకొండ యాదగిరి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిజ్జు దత్తాద్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హన్మాండ్లు, ఉపాధ్యక్షుడు పెండ్యాల జీవన్, సహాయ కార్యదర్శి మెరుగు లక్ష్మీ నారాయణ, నిర్వహణ అధ్యక్షుడు పిట్ల గణేష్, కార్యదర్శి చింతల గంగాదాస్, చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బింగి ధరంవీర్, జిల్లా కార్యదర్శి మెరుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

    Teachers Day | లయన్స్ క్లబ్ ఆఫ్ నేత ఆధ్వర్యంలో..

    నగరంలోని పద్మశాలి ఉన్నత పాఠశాలలో (Padmasali High School) ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన 15మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్​ నేత (Lions Club of Neta) జిల్లా కార్యదర్శి దీకొండ యాదగిరి, రీజియన్ కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు, అధ్యక్ష కార్యదర్శులు హీరమల్ల విష్ణు, ధర్మరాజు, కోశాధికారి రవీందర్, పూర్వాధ్యక్షులు పుల్గం హన్మాండ్లు, చింతల గంగాదాస్, పద్మశాలి ఉన్నత పాఠశాల అధ్యక్ష కార్యదర్శులు అవదూత విఠల్, చిలుక వెంకటేష్, లయన్స్ క్లబ్ ఆఫ్ నేత ప్రతినిధులు లింగం, కైరంకొండ మురళి, దేవిదాస్, ధరంవీర్ తదితరులు పాల్గొన్నారు.

    Teachers Day | భవిష్యత్తును పరిచయం చేసేది గురువులే..

    బాధ్యతను, బడిని.. భవిష్యత్తును పరిచయం చేసేది గురువులు అని రోటరీ క్లబ్ (Rotary Club) నిజామాబాద్ మాజీ అధ్యక్షుడు, న్యాయవాది గోపాల్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో శనివారం పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు శ్యాంసుందర్ అగర్వాల్, కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ జాజు, కార్యనిర్వాహణాధికారి గోపాల్ సోని, డైరెక్టర్ రాజ్​కుమార్​ సుబేదార్, సభ్యులు ఆకుల అశోక్, శ్రీనివాసరావు, విజయ రావు, జ్ఞాన ప్రకాష్, సతీష్, డాక్టర్ హరీష్ స్వామి, డాక్టర్ అంకిత్ అగర్వాల్, తదితరులు పాల్గొన్నారు.

    Teachers Day | ఆర్మూర్​లో ఆక్స్​ఫర్డ్​ పాఠశాలలో..

    అక్షరటుడే, ఆర్మూర్‌: గురువుతోనే ఉన్నతమైన సమాజం నిర్మితమవుతుందని, గురువులు సమాజానికి మార్గ నిర్దేశకులు అని ఇంపాక్ట్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌(Impact Club International) జాతీయ కార్యదర్శి అప్పన్నగారి వెంకట్రావు అన్నారు.

    శనివారం ఆర్మూర్‌ పట్టణ శివారులోని ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించేది గురువులేనన్నారు. గురువులు ప్రత్యక్ష దైవంతో సమానులని, వారు చూపే మార్గంలో నడిచి, ఉన్నత శిఖరాలు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ మానస గణేష్, పరిపాలన అధికారి పద్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

    More like this

    Tiruma Temple close | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. రేపు తిరుమల ఆలయం మూసివేత

    అక్షరటుడే, తిరుమల: Tiruma Temple close | భాద్రపద పౌర్ణమి Bhadrapada Pournami రోజున అంటే ఈనెల 7న...

    Muslim owns laddu | వినాయకుడి లడ్డూ సొంతం చేసుకున్న ముస్లిం.. వరుసగా రెండోసారి

    అక్షరటుడే, హైదరాబాద్: Muslim owns laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. హైదరాబాద్​లో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...

    Vinayaka Laddu | రికార్డు స్థాయి ధర పలికిన శ్రీ గణేశ్​ మండలి లడ్డూ.. ఏకంగా రూ. 1.65 లక్షల పైనే..

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka Laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. నిజామాబాద్​ జిల్లాలో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...