Reunion
Reunion | 40 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై.. ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

అక్షరటుడే, నిజాంసాగర్ : Alumni Reunion | వాళ్లంతా 40 ఏళ్ల క్రితం ఒకే దగ్గర చదువుకున్నారు. ప్రస్తుతం వేర్వేరు రంగాల్లో.. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అయినా ఒకే వేదికపై కలవాలని సంకల్పించారు. ఈ మేరకు నాడు చదువుకున్న విద్యార్థులు అంతా కలిసి ‘పునర్​ మిలన్’​ పేరిట ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.

బిచ్కుంద (Bichkunda) పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (Govt Junior College)లో 1984 – 85 సంవత్సరంలో పదో తరగతి​ చదివిన విద్యార్థులంతా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక బండయప్ప ఫంక్షన్ హాల్ (Bandayappa Function Hall)​లో కలుసుకొని చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడిగా గడిపారు. తమకు తవిద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల్లో ప్రస్తుతం నలుగురు మాత్రమే ఉన్నారు. అప్పటి ప్రిన్సిపల్ రాజయ్య గుప్తా, ఉపాధ్యాయులు రమేష్ రావు, నాగనాథ్, సంగప్ప ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో వారిని ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు బండాయప్ప మఠాధిపతి సోమయ్యప్ప మహారాజ్​తో తదితరులు హాజరయ్యారు.