అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nizamabad | నిజామాబాద్ నగరంలోని బోర్గాం(పి) జెడ్పీ హైస్కూల్ సోషల్ టీచర్ జ్యోతి ఉద్యోగ విరమణ పొందారు. ఈ మేరకు శనివారం పాఠశాలలో తోటి ఉపాధ్యాయులు ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఆమెను శాలువా, పూలమాలతో సత్కరించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. జ్యోతి ఏడేళ్లుగా పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించి, ఎనలేని సేవలు చేశారన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆమె పాఠశాలకు రూ.20వేల విలువైన ఆంప్లిఫయర్‌ను బహూకరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.