అక్షరటుడే, ముప్కాల్: Alumni Reunion | ముప్కాల్ ఉన్నత పాఠశాల (Mupkal High School) 2003-04 పదోతరగతి బ్యాచ్‌కు (Tenth Batch) చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాఠశాల రోజుల్లో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. నాడు తమకు విద్యాబుద్ధులు చేర్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. గురువుల సేవలను స్మరించుకుంటూ, విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి తోడ్పడేందుకు సంకల్పబద్ధంగా ముందుకు రావాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.