అక్షరటుడే, ఇందూరు: Care Degree College | నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో మ్యాజిక్ బస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ నియామకాలకు (Campus Recruitment) అనూహ్య స్పందన లభించిందని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ పేర్కొన్నారు. కళాశాలలో జరిగిన ఇంటర్వ్యూలకు సుమారు 300కు పైగా ఉద్యోగార్థులు హాజరయ్యారని వీరిలో 40మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారన్నారు.
ఇంటర్వ్యూల్లో వరుణ్మోటార్స్ (Varun Motors), వైసిస్ క్లౌడ్ టెక్నాలజీస్ (YSIS Cloud Technologies), ముత్తూట్ ఫైనాన్స్(Muthoot Finance), అపోలో ఫార్మసీ(Apollo Pharmacy), 3 జీఆర్ సర్వీసెస్ (3GR Services), 2050 హెల్త్ కేర్ సర్వీసెస్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (HDB Financial Services) తదితర కంపెనీలు పాల్గొన్నాయి. అలాగే మ్యాజిక్ బస్ ఫౌండేషన్ (Magic Bus Foundation) ప్రతినిధులు రమేష్, నరేష్ జాబ్ మేళాను నిర్వహించారు. కార్యక్రమంలో కేర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ, నరేశ్, శంకర్, సందేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.