అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | హైదరాబాద్ నగరంలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. నకిలీ తుపాకీతో బెదిరించి ఓ బంగారం దుకాణంలో (gold shop) చోరీ చేశారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ (Keesara Police Station) పరిధిలో నాగారం సత్యనారాయణ కాలనీలోని ఓ వ్యక్తి బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆ దుకాణంలోకి దుండగులు నకిలీ తుపాకీతో వచ్చారు. అనంతరం యజమానిని బెదిరించి చోరీకి యత్నించారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన యజమానిని రాడ్‌తో కొట్టి బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో షాపు యజమానికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న దొంగల కోసం గాలిస్తున్నారు. కాగా దొంగలు తుపాకీని అక్కడే పడేసి వెళ్లడంతో నకిలీదిగా గుర్తించారు. ఎంత బంగారం పోయిందనే వివరాలు ఇంకా తెలియరాలేదు.
Hyderabad | రెచ్చిపోతున్న దొంగలు
హైదరాబాద్ నగరంలో (Hyderabad city) ఇటీవల చోరీలు పెరిగాయి. శివారు కాలనీల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. అలాగే పట్టపగలు సైతం దోపిడీలు చేస్తున్నారు. దుకాణాల్లోకి చొరబడి బెదిరింపులకు పాల్పడుతున్నారు. గతంలో చందానగర్‌లోని ఓ బంగారం దుకాణంలోని పలువురు గన్లతో ఎంటర్ అయి బంగారంతో పరారయ్యారు. బీహార్‌కు చెందిన ముఠా ఈ చోరీ చేయగా.. పోలీసులు పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.