ePaper
More
    HomeతెలంగాణNizamabad City | అంగట్లో సరుకులా ఆడపిల్ల.. కన్న కూతురినే అమ్మేసిన తల్లిదండ్రులు..

    Nizamabad City | అంగట్లో సరుకులా ఆడపిల్ల.. కన్న కూతురినే అమ్మేసిన తల్లిదండ్రులు..

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | ఆడపిల్ల అంటే అంగట్లో సరుకులా మారిపోయింది. నవమాసాలు మోసి కన్న కూతురిని తల్లి దండ్రులు అమ్మేసిన ఘటన నిజామాబాద్​ నగరం(Nizamabad City)లో కలకలం సృష్టించింది. ఐదో సంతానం కావడంతో పోషించే స్థోమత లేదని.. ఏకంగా బిడ్డను బేరం పెట్టారు.

    వన్ టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి(One Town SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​ నగరంలోని మిర్చి కాంపౌండ్​(Mirchi Compound)కు చెందిన ముత్యాలమ్మ, వెంకట్​రావులకు ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నారు. కాగా.. జూన్​ 30న ఐదో సంతానంగా ఆడపిల్ల జన్మనించింది. దీంతో శిశువును అమ్మకానికి పెట్టారు. స్థానికుల సహాయంతో సోలాపూర్(Solapur)​కు చెందిన వ్యక్తికి రూ. 2 లక్షలకు విక్రయించారు. ఐదు రోజుల క్రితం అమ్మేయగా ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో శుక్రవారం రాత్రి స్థానిక సీడీపీవో(CPDO) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. చిన్నారిని రికవరీ చేసి సంరక్షణ గృహానికి తరలించినట్లు తెలిసింది.

    కాగా.. సమాజంలో ఆడపిల్లల పట్ల చిన్నచూపు ఇంకా ఏదో మూల దాగే ఉందనేది ఇలాంటి ఘటనలు చూస్తుంటే అర్థమవుతోంది.

    More like this

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...