అక్షరటుడే, వెబ్‌డెస్క్: Traffic Police | ఆటో వెనకాల గ్యాంగస్టర్ లారెన్స్ బిష్ణోయ్ (gangster Lawrence Bishnoi) ఫొటో పెట్టుకున్నాడో వ్యక్తి. ఈ ఫొటో సోషల్ మీడియాలో (social media) వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎడపల్లికి చెందిన సాయి కిరణ్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తన ఆటో వెనకాల గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్, గన్ ఉన్న పోస్టర్ అతికించాడు. ఆటో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (ACP Mastan Ali), సీఐ ప్రసాద్ సదరు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేశారు. ఘటన వెలుగులోకి వచ్చిన 12 గంటల్లో కేసు నమోదు చేశామన్నారు. ఏసీపీ మస్తాన్ అలీ మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు, సోషల్ మీడియాలో అనుచితమైన కంటెంట్‌ను పోస్ట్ చేసినందుకు నిందితుడిని అరెస్టు చేశామన్నారు. అటువంటి చర్యలపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.