అక్షరటుడే, ఆర్మూర్ : Volleyball Tournament | ఆర్మూర్ మండలం (Armoor Mandal) మగ్గిడి పాఠశాల పూర్వ విద్యార్థిని నిషిత జాతీయ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల పీఈటీ మధు తెలిపారు. ఈ మేరకు గురువారం వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం నిషిత వైజాగ్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాలీబాల్ అకాడమీలో శిక్షణ పొందుతోందన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి 21వరకు రాజస్థాన్‌లో జరుగుతున్న జూనియర్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌కు (Junior Volleyball Championship) ఎస్ఏఐ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) టీం తరఫున ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు.
Volleyball Tournament | పంజాబ్‌లోని పాటియాలలో..
పంజాబ్‌లోని పటియాలలో (Punjab Patiala) జరిగిన శిక్షణ శిబిరంలో అద్భుత ప్రతిభ కనబర్చి జాతీయ జూనియర్ వాలీబాల్ టోర్నీకి నిషిత ఎంపికైందని పీఈటీ మధు తెలిపారు. జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక కావడంపై వీఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్ హనుమంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్, ట్రెజరర్ గంగారెడ్డి, జిల్లా యూత్, క్రీడల అధికారి పవన్‌కుమార్, హెచ్ఎం తిరునగరి హరిత, ఉపాధ్యాయులు, మగ్గిడి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.