అక్షరటుడే, ఆర్మూర్ : Sand Artist | పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ (Housing Board Colony) రోడ్డులో విజయవాడ సైకతశిల్పి ఆకునూరి బాలాజీ వరప్రసాద్ ఇసుకతో సైకత శిల్పాలను రూపొందించారు. పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయ్ అగర్వాల్, స్పార్క్ మీడియా లావణ్య సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం ఈ ఇసుక దశావతారాల ప్రదర్శన చేపట్టారు.
న్న
Sand Artist | ఆకట్టుకున్న సైకత శిల్పాలు
ఇసుకతో విష్ణుమూర్తి దశావతారాలను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. దశావతారంలో భాగంగా మత్స్యవతారం, కూర్మ, నృసింహస్వామి, వామన, అనంతపద్మనాభ స్వామి, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బాలరామ, కల్కి, వినాయక అవతారాలను ఇసుకతో తీర్చిదిద్దారు.

Sand Artist | అపూర్వస్పందన
ఇసుకతో రూపొందించిన శిల్పాలను తిలకించడానికి ప్రజలు ఆసక్తి చూపించారు. కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) లింగాగౌడ్, ఖందేశ్ శ్రీనివాస్, మున్నాభాయ్‌తో పాటు ఆర్మూర్‌లోని స్మైల్ పాఠశాల విద్యార్థులు (Smile School Students), ఆర్మూర్ చుట్టూ పక్క గ్రామాల ప్రజలు తిలకించారు.
