అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vennela Kishore | ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ దక్కించుకోవడం చాలా కష్టం. కాంపిటీషన్ అంతలా ఉంది. అయితే సినిమా ఛాన్స్ వచ్చిన కూడా దర్శకులు చెప్పినట్టు నడుచుకోకపోతే ఆఫర్ మిస్ అయినట్టే. ప్రముఖ కమెడీయన్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) పక్కన నటించేందుకు ఏకంగా లైపో సర్జరీకి సిద్ధమయ్యాడట. ఇంతకు ఆ కమెడీయన్ Comedian ఎవరనే కదా మీ డౌట్.. వెన్నెల కిషోర్(Vennela Kishore). కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యభరితమైన పాత్రలతో, తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. రీసెంట్‌గా ‘#సింగిల్’ సినిమాతో థియేటర్లలోకి వచ్చిన ఆయన.. మరోసారి తన కామెడీతో నవ్వులు పూయిస్తున్నారు. ఈ క్రమంలో వెన్నెల కిషోర్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. మహేష్ బాబుతో కలిసి దూకుడు సినిమాలో నటించే సమయంలో జరిగిన ఓ విషయాన్ని పంచుకున్నారు.
Vennela Kishore | సర్జరీ ఎందుకు..
దూకుడు సమయంలో నేను కొంచం బొద్దుగా ఉన్నాను. అయితే మహేష్ బాబు(Mahesh Babu) పక్కన ఫ్రెండ్ రోల్లో కనిపించడానికి నన్ను ఎంపిక చేయగా, కొంచెం బొద్దుగా ఉండడంతో నన్ను లైపో సర్జరీ చేసుకోమని దర్శకుడు శ్రీను వైట్ల(Srinu Vaitla) సూచించారని వెన్నెల కిషోర్ తెలిపారు. ఎందుకంటే మహేష్ బాబు MAhesh babu స్లిమ్‌గా ఫిట్‌గా ఉంటారు కాబట్టి పక్కన ఫ్రెండ్స్ కూడా స్లిమ్‌గా ఉండాలని శ్రీను వైట్ల అన్నారు. దాంతో నన్ను సర్జరీ చేయించుకోమన్నారు. కానీ ఆ తర్వాత కొన్ని షాట్స్ తర్వాత వద్దులే ఇలానే బాగుంది అని చెప్పారని వెన్నెల కిషోర్ తెలిపారు. ఇక తాను ఎన్ని సినిమాలు చేసినా ‘వెన్నెల’, ‘బిందాస్’, ‘దూకుడు’ చిత్రాల్లో చేసిన పాత్రలు మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయని కిషోర్ అన్నారు.
‘గీత గోవిందం’ ‘అమీతుమీ’ చిత్రాల్లో చేసిన పాత్రలు తనకు బాగా ఇష్టమని చెప్పారు. ఇప్పుడున్న కాలంలో కామెడీ పండించడం చాలా పెద్ద ఛాలెంజ్ అని వెన్నెల కిషోర్ (Vennela Kishore) అన్నారు. నిజానికి కామెడీ పాత్రలను ఎంచుకునే అంత వెర్సటాలిటీ ఇప్పుడు లేదని అభిప్రాయపడ్డారు. రైటర్స్‌ను మనం చాలా ఎంకరేజ్ చేయాలి. రైటర్స్ కొత్తకొత్త ఆలోచనలతో వస్తేనే కామెడీ పాత్రలు కూడా కొత్తగా వస్తాయి. చాలాసార్లు రెగ్యులర్ పాత్రలే వస్తుంటాయి. కానీ దాన్ని ఓన్ చేసుకొని అందులోనే ఏదో ఒక యూనిక్ నెస్ని ప్రజెంట్ చేసేలా ప్రయత్నం చేస్తుంటాను. ‘చార్లీ’ సినిమా తర్వాత మళ్లీ హీరోగా చేయమని తన దగ్గరకు కథలు తీసుకోస్తున్నారని.. కానీ తనకు అంతగా సూటవ్వని లవ్ స్టోరీ, పాటలు అంటున్నారని.. మంచి కామెడీ కథ కుదిరితే తప్పకుండా హీరోగా చేస్తానంటూ కిషోర్ స్పష్టం చేశారు.