అక్షరటుడే, ఇందూరు : Daycare Center | వయోవృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం (State Government) ‘ప్రణామం’ పేరుతో కార్యక్రమాన్ని అమలు చేస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) తెలిపారు. జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ సొసైటీ భవనంలో వృద్ధుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠితో (Collector Ila Tripathi) కలిసి ప్రారంభించారు.
Daycare Center | సమాజాభివృద్ధిలో వృద్ధులే కీలకం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజాభివృద్ధిలో వృద్ధుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే అన్నారు. ఈ మేరకు వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ మానసిక ఆత్మస్థైర్యం పెంపొందించడం కోసం, గౌరవప్రదమైన జీవన విధానం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డేకేర్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. తల్లిదండ్రుల ఆలనాపాలన పట్టించుకోని ఉద్యోగుల జీతాల నుంచి కొంత మొత్తాన్ని తల్లిదండ్రులకు చెల్లిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారని గుర్తు చేశారు.
Daycare Center | తలసేమియా సికిల్ సెల్..
అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ (Red Cross Society) ద్వారా తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ..తన కోటా నిధుల నుంచి రూ.15 లక్షల నిధులు మంజూరు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, కరిపే రవీందర్, అరుణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.