అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Diksha Divas | మాజీ సీఎం కేసీఆర్ (KCR) తెలంగాణ సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టిన రోజును బీఆర్ఎస్ నాయకులు దీక్షా దివస్‌గా (Diksha Divas) జరుపుకుంటున్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే.
కేసీఆర్ దీక్షపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. 16 ఏళ్ల క్రితం తెలంగాణ విధిని మార్చి రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన రోజు ఇది అని ఆయన అభివర్ణించారు. నవంబర్ 29, 2009 చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) స్పందిస్తూ.. ఒక యోధుని దీక్ష.. అమరుల త్యాగం యావత్ తెలంగాణ జాతికి మేలుకొలుపు అయ్యిందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని విజయపథం వైపు నడిపిందన్నారు. భౌగోళిక తెలంగాణ (geographical Telangana) సాధించాం. సామాజిక తెలంగాణ సాధిస్తామని పేర్కొన్నారు.
Diksha Divas | ఉద్యమ గతిని తిప్పింది
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న ప్రారంభించిన ఆమరణ దీక్ష, ఉద్యమ గతిని మలుపు తిప్పిందని హరీశ్‌రావు అన్నారు. ఈ దీక్ష తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసిందని చెప్పారు. ‘రానే రాదు, కానే కాదు’ అన్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సబ్బండ వర్గాలను ఏకం చేసి సుసాధ్యం చేసి చూపిన ఘన చరిత కేసీఆర్‌ది అన్నారు. తెలంగాణ అజరామర చరిత్రకు (Telangana immortal history) వీరోచిత సంతకం కేసీఆర్ అని పేర్కొన్నారు. నవంబర్ 29న కేసీఆర్ దీక్ష లేకుండా డిసెంబర్ 9 ప్రకటన లేదని గుర్తు చేశారు. దశాబ్దాల పోరాటంతోనే తెలంగాణ ఏర్పాటు అయిందన్నారు. పాలకుల దయాదాక్షిణ్యాలతో కాదని చెప్పారు.