ePaper
More
    HomeజాతీయంHoneymoon Couple Missing | హనీమూన్​కు వెళ్లిన ఓ జంట అదృశ్యం.. ఎక్కడంటే..!

    Honeymoon Couple Missing | హనీమూన్​కు వెళ్లిన ఓ జంట అదృశ్యం.. ఎక్కడంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: honeymoon couple missing : హనీమూన్​కు వెళ్లిన జంట అదృశ్యమైన (Couple Missing) ఘటన మేఘాలయ(Meghalaya)లో జరిగింది.

    వారం రోజులు గడిచినా ఇంకా వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్​గా తీసుకుంది. పోలీసులు, వివిధ శాఖల అధికారులతో పాటు స్థానికులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా (Chief Minister Conrad Sangma) తెలిపారు. ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

    మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇందౌర్(Indore)​లో ట్రాన్స్ పోర్టు వ్యాపారం చేసే రాజా రఘవంశీ – సోనమ్​ నవ దంపతులు. హనీమూన్ కోసం మే 20న మేఘాలయ వెళ్లారు. చివరిసారిగా సోహ్రా (చిరపుంజి)Sohra (Cherrapunji)లో పర్యటించారు. ఆ తర్వాత అదృశ్యమయ్యారు. బైకు అద్దెకు తీసుకొని కొండప్రాంతం వైపు వెళ్లిన వీరు, ఓ ప్రాంతంలో వాహనం వదిలేసి కాలినడకన వెళ్లినట్టు భావిస్తున్నారు. వీరి కోసం మేఘాలయ సర్కారు ముమ్మరంగా గాలింపు చేపట్టింది. దంపతుల కుటుంబ సభ్యులు సైతం వారి ఆచూకీ తెలిపితే రూ.5 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించింది.

    “మధ్యప్రదేశ్​కు చెందిన నవ దంపతులకు సంబంధించి దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. వారు అదృశ్యమైనట్లు నివేదికలు వచ్చాయి. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ (Madhya Pradesh CM Mohan Yadav) నాతో మాట్లాడారు. అక్కడి హోంశాఖ నుంచి ఫోన్​ కాల్స్ వచ్చాయి. ఈ ఘటనపై నిత్యం వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నా. ఆ జంట ఆచూకీ కోసం పోలీసులు, అధికారులు, స్థానిక ప్రజలు ముమ్మురంగా గాలిస్తున్నారు” అని ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఓ వీడియో సందేశంలో చెప్పుకొచ్చారు.

    వర్షాలు పడుతుండటంతో గాలింపు చర్యలకు సవాళ్లు ఎదురవుతున్నాయని సీఎం తెలిపారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. చిరపుంజిలో భారీ వర్షాలు పడుతుండటంతో సెర్చ్ ఆపరేషన్​ ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు.

    More like this

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

    Cross Voting | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపైనే అనుమానం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cross Voting | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధకృష్ణన్ ఘన...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...