అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gun Misfire | గన్ మిస్ ఫైర్ అయి కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన నంద్యాల ( Nandyal) జిల్లా డోన్ రైల్వే స్టేషన్లో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
కర్నూల్ జిల్లా సీ బెళగల్ గ్రామానికి చెందిన పెద్దయ్య రైల్వే పోలీస్ (Railway Police) కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. శనివరాం రాత్రి హుబ్లీ నుంచి విజయవాడ మార్గంలో బీట్ ముగించుకని తెల్లవారుజామున 3:30 గంటలకు డోన్ స్టేషన్ (Dhone Railway Station)కు వచ్చాడు. జీఆర్పీ (GRP) ఔట్‌పోస్టులో తన ఆయుధాన్ని సరెండర్ చేయడానికి వెళ్లాడు. తన గన్ను లాకప్‌లో పెట్టడానికి వెళ్లిన సమయంలో గన్ మిస్ ఫైర్ అయింది. బుల్లెట్ శరీరంలో నుంచి దూసుకెళ్లడంతో పెద్దయ్య కిందపడిపోయాడు. అక్కడ విధుల్లో ఉన్న సెంట్రీ, మరో కానిస్టేబుల్ వెంటనే వెళ్లి చూడగా.. అప్పటికే అతడు చనిపోయాడు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
డోన్ డీఎస్పీ, రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. 1995 బ్యాచ్‌కు చెందిన పెద్దయ్య మొదట ఎపీఎస్పీలో విధులు నిర్వహించారు. అనంతరం ఏఆర్‌కు బదిలీ అయ్యాడు. అక్కడి నుంచి జీఆర్పీకి వచ్చారు. 8 ఏళ్లుగా డోన్ రైల్వే పోలీస్ స్టేషన్లో పని చేస్తున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.