అక్షరటుడే, కామారెడ్డి : Municipal Corporation | కామారెడ్డి (Kamareddy) పట్టణంలో బీజేపీ బలంగా ఉందని, అందుకే అధికార పార్టీ దొంగ ఓట్లతో గెలిచేందుకు కుట్ర చేస్తోందని బీజేపీ నాయకులు (BJP Leaders) ఆరోపించారు. ఓటరు జాబితాను సవరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు.
Municipal Corporation | వార్డు ఆఫీసర్లదే తప్పిదం..
కమిషనర్ లేదా లోకల్ బాడీ కలెక్టర్ (Local Body Collector) వచ్చి సమాధానం చెప్పాలని, అప్పటివరకు ఇక్కడినుంచి కదిలే ప్రసక్తి లేదని బీజేపీ భీష్మించుకుని కూర్చుకున్నారు. దీంతో ఇన్ఛార్జి కమిషనర్ వచ్చి బీజేపీ నాయకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఓటరు జాబితాలో తప్పులు ఉంటే అభ్యంతరాలు ఇవ్వాలని సూచించారు. ఒక వార్డు నుంచి మరొక వార్డుకు మారిన ఓటర్ల అంశంపై స్పందిస్తూ వార్డు ఆఫీసర్ల తప్పిదమేనన్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ (Field Verification) సరిగా చేయకపోవడం వల్ల అలా జరిగి ఉంటుందన్నారు.
Municipal Corporation | బౌండరీలు తెలియక..
బౌండరీలు తెలియక కూడా తప్పులు జరిగాయని కమిషనర్ తెలిపారు. వీటన్నింటిని పరిష్కరిస్తామని ఇన్ఛార్జి కమిషనర్ (In-charge Commissioner) హామీ ఇచ్చారు. 8వ తేదీ లోపు అభ్యంతరాలు తెలపాలని, వాటిని సవరించి 9న మరోసారి నాయకులకు జాబితా ఇస్తామని, అప్పటికి తప్పులు దొర్లితే సరిచేసి 10వ తేదీన ఎన్నికల కమిషన్కు (Election Commission) ఓటరు జాబితా సమర్పిస్తామని తెలిపారు. ఓటరు జాబితా సవరించకుండా తుది జాబితా ప్రకటిస్తే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.