అక్షరటుడే, కామారెడ్డి : VHP- Bajrang Dal | పాకిస్థాన్‌తో విడిపోయిన బంగ్లాదేశ్ మళ్లీ ఆ దేశంతో చేయి కలిపి భారతదేశంలో ఐక్యతను దెబ్బతీసే కుట్ర చేస్తోందని వీహెచ్‌పీ, బజరంగ్దళ్ నాయకులు ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో (Bangladesh) హిందువులపై జరుగుతున్న మారణహోమాన్ని నిరసిస్తూ పైరెండు సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం నిజాంసాగర్ చౌరస్తాలో (Nizam Sagar Chowrasta) బంగ్లాదేశ్ గుండాల దిష్టిబొమ్మను దహనం చేశారు.
VHP- Bajrang Dal | శత్రుదేశంతో చేతులు కలిపి..
ఈ సందర్భంగా వీహెచ్‌పీ, బజరంగ్దళ్ సంస్థల ప్రతినిధులు బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారతదేశం వేసిన భిక్షతో బంగ్లాదేశ్ ఏర్పడిందన్నారు. అలాంటి దేశం పాకిస్థాన్‌తో (Pakistan) చేతులు కలిపి హిందువులపై మారణహోమం సృష్టిస్తోందన్నారు. ఇలాంటి ఘటనలను బంగ్లాదేశ్ తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలపై భారత ప్రభుత్వం (India Government) కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇరు సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.