అక్షరటుడే, ఇందూరు : MLA Prashanth Reddy | కేసీఆర్‌ను మానసికంగా హింసించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను (KCR) కాంగ్రెస్ ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా సిట్ విచారణ చేయిస్తోందని విమర్శించారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.
MLA Prashanth Reddy | అధికారాన్ని అడ్డుపెట్టుకుని..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) అధికారాన్ని అడ్డం పెట్టుకొని కావాలని కేసీఆర్‌ను మానసికంగా హింసించేందుకు కుట్ర పన్నుతోందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని కేసీఆర్‌కు జరిగిన అవమానాన్ని వారు తట్టుకోలేకపోతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి, బీఆర్ఎస్ (BRS)పై దృష్టి సారిచిందన్నారు.
MLA Prashanth Reddy | దిష్టిబొమ్మ దహనం అడ్డగింత
సిట్ విచారణకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిష్టిబొమ్మ దహనం చేయడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఈ చర్యలను అడ్డగించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య కాస్త తోపులాట చోటుచేసుకుంది. కొందరు కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా (Former MLA Ganesh Gupta), నగర అధ్యక్షుడు రాజు, నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్‌ను అడ్డుకొని పార్టీ కార్యాలయానికి తరలించారు.
