170
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Banswada | బాన్సువాడ పట్టణంలో ఓ వివాహితను లైంగికంగా వేధిస్తున్నాడని కాంగ్రెస్ నాయకుడి (Congress Leader)పై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బాధిత మహిళ భర్తకు తెలపడంతో సదరు నాయకుడిని చితకబాదాడు.
బాన్సువాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు మహిళను వేధిస్తున్న సమయంలో ఆమె భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం ఆసుపత్రి నుంచి రోడ్డుపైకి తీసుకువచ్చి చెప్పుతో కొడుతూ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పంచాయితీ బాన్సువాడ పోలీస్ స్టేషన్ (Banswada Police Station)కు చేరింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.