More
    Homeఆంధ్రప్రదేశ్​Operation Sindoor | భారత ఆర్మీకి రూ. 5 లక్షలు ఇచ్చిన సామాన్యుడు.. బర్త్​డే సందర్భంగా...

    Operation Sindoor | భారత ఆర్మీకి రూ. 5 లక్షలు ఇచ్చిన సామాన్యుడు.. బర్త్​డే సందర్భంగా విరాళం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | ఆపరేషన్​ సింధూర్​ అనంతరం భారత్​ – పాక్​ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్​ ప్రయోగిస్తున్న మిస్సైల్స్​, డ్రోన్​లను భారత్​ విజయవంతంగా కూల్చివేస్తోంది (india shotdown pakistan missilesand drones). పాక్​ దాడులతో భారత్​ ఎదురుదాడులు చేస్తున్న విషయం తెలిసిందే (india counterattack to pakistan). ఇందుకోసం సైన్యం పోరాటం చేస్తోంది. దేశ రక్షణకోసం అలుపెరుగకుండా పనిచేస్తోంది.

    భారత్ – పాక్​ ఉద్రిక్తతల (india-pakistan tension) వేళ.. మన సైన్యం చూపుతున్న ధైర్య సాహసాలను యావత్ దేశం కీర్తిస్తోంది. భారత సైన్యం (indian army) శక్తిని తట్టుకోలేక.. సరిహద్దుల్లో అమాయక ప్రజలపై కాల్పులకు పాక్​ తెగుబడుతోంది. పాక్​ కాల్పులను సైతం భారత్​ తిప్పికొడుతోంది. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో సైన్యానికి యావత్ దేశం అండగా నిలబడుతోంది (india is standing with india army). ఈ క్రమంలోనే తిరుపతికి చెందిన ఓ వ్యక్తి తన దేశభక్తి చాటుకున్నాడు. పుట్టినరోజు సందర్భంగా భారత సైన్యానికి ఉడతా భక్తిగా రూ. 5 లక్షల విరాళం అందించాడు తిరుపతికి జ్యోతికృష్ణ నాయుడు(Jyothi Krishna Naidu). భారత ఆర్మీకి విరాళం ఇచ్చి దేశం పట్ల తనకు ఉన్న భక్తి ని చాటుకున్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆర్మీ అధికారుల (army officers) మధ్య కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నాడు. అనంతరం రూ.5 లక్షల చెక్కును (five lakh cheque) అధికారులకు అందజేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సైన్యం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయిలో ఉండాలనేది తన కోరిక అని తెలిపాడు.

    More like this

    Hyderabad Drug racket | హైదరాబాద్ నడిబొడ్డున డ్రగ్స్ కలకలం.. బడిలో తయారు చేస్తున్న ప్రిన్సిపల్​

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Drug racket | విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్​లో ఇటీవల వెలుగు చూస్తున్న డ్రగ్స్...

    Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ.. విద్యార్థుల ఘర్షణలకు అడ్డగా మారింది. తరచూ గొడవలు చెలరేగుతున్నాయి....

    Bihar election trains | తెలంగాణ మీదుగా బీహార్ ఎన్నికల రైళ్లు.. అవేమిటంటే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Bihar election trains | బీహార్​కు నూతన రైళ్లు, పొడిగింపుల పండుగ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో...