Homeభక్తిRakhi Pournami | ఎన్నో విశిష్టల సమాహారం.. రాఖీ పౌర్ణమి పర్వదినం..!

Rakhi Pournami | ఎన్నో విశిష్టల సమాహారం.. రాఖీ పౌర్ణమి పర్వదినం..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rakhi Pournami : ఏటా శ్రావణ (Shravan) మాసంలో వచ్చే పున్నమిని రాఖీ పౌర్ణమిగా నిర్వహించుకుంటాం. సోదరుల క్షేమం కోరుతూ సోదరీమణులు రాఖీ కడుతుంటారు. విజయం కాంక్షిస్తూ నోరు తీపి చేస్తుంటారు.

Rakhi Pournami : అసలు రాఖీ అంటే..

రాఖీ (Rakhi) అంటే ‘రక్షణ’ (Raksha Bandhan) అని చెబుతారు. తమ తోబుట్టువులకు ఎలాంటి అవాంతరాలు, ఆపదలు రాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కాంక్షిస్తూ ఆడపడుచులు తమ సోదరులకు రక్ష కడుతుంటారు. ఈ రక్షనే రాఖీగా పేర్కొంటారు. తమ అభ్యున్నతి, శ్రేయస్సుని కోరుకునే సోదరీమణులకు ఈ పర్వదినం సందర్భంగా సోదరులు కానుకలిస్తుంటారు.

Rakhi Pournami : ముహూర్తం ఎప్పుడంటే..

శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు రాఖీ పండగ నిర్వహించుకుంటాం. నేడు (ఆగస్టు 9) ఉదయం 9 నుంచి 10:30 గంటలలోపు సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టాలని పండితులు సూచిస్తున్నారు.

Rakhi Pournami : పండగ నిర్వహించుకునే విధానం..

ఉదయం తలారా స్నానం చేయాలి. ఇంటిని పూలమాలలతో అలంకరించాలి. దర్వాజలను మామిడి తోరణాలతో అలంకరించాలి. దేవుని చిత్రపటం వద్ద దీపం వెలిగించాలి. ఒక పళ్లెంలో దీపం, అక్షింతలు, రాఖీ, మిఠాయి సిద్ధంగా ఉంచుకోవాలి.

ఇక సోదరుల వద్దకు వెళ్లి రాఖీ కట్టాలి. ఆపై హారతి ఇచ్చి, అక్షింతలు వేయాలి. చివరగా మిఠాయి తినిపించాలి. ఈ క్రమంలో సోదరులు తమ సోదరీమణులకు ప్రేమతో కానుకలు సమర్పించుకోవాలి.

Rakhi Pournami : ఎన్నో పేర్లతో వేడుక..

రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో నిర్వహించుకుంటారు. నార్త్ ఇండియా(North India)లో రక్షా బంధన్​గా, సావనీ, సలోనా అని కూడా పేర్కొంటారు. మహారాష్ట్ర(Maharashtra)లో నరాళి పూర్ణిమ, గుజరాత్​(Gujarat)లో పవిత్రోపనా, దక్షిణ భారత్​(South India)లో నారికేళ పౌర్ణమిగా ఆచరణలో ఉంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్​లో ఘూలాన్ పూర్ణిమ అంటారు.