అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: GGH Nizamabad | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లో పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. దీంతో ఓ చిన్నారికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి మొదటి అంతస్తులో రూం నెంబర్ 178లో శుక్రవారం సాయంత్రం పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. దీంతో బెడ్‌పై ఉన్న శిశువుకు గాయాలయ్యాయి. వెంటనే చిన్నారి చికిత్స నిమిత్తం వేరే వార్డుకు తరలించారు. కాగా.. ఆస్పత్రి భవనం నిర్వహణను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు.