RTC Bus | బురద పడిందని రచ్చ.. బస్సు డ్రైవర్​పై పోలీసులకు ఫిర్యాదు.. తర్వాత ఏం జరిగిందంటే?

అక్షరటుడే, నిజాంసాగర్​ : RTC Bus | వానాకాలంలో మనం రోడ్డుపై వెళ్తుండగా పక్క నుంచి వాహనాలు వెళ్తే నీరు, బురద పడుతుంది. అలాంటి సమయంలో వాహనదారుడిని, రోడ్లను తిట్టుకుంటూ మనం ముందుకు వెళ్తాం. కానీ ఈ వ్యక్తి మాత్రం అలా వదల్లేదు. తనపై బురద పడటానికి కారణమైన వ్యక్తిని పోలీస్​ స్టేషన్​ మెట్లు ఎక్కించాడు. ఈ ఘటన నిజాంసాగర్ (Nizamsagar) మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. కామారెడ్డి డిపోకు (Kamareddy Depot) చెందిన ఆర్టీసీ […]

అక్షరటుడే, నిజాంసాగర్​ : RTC Bus | వానాకాలంలో మనం రోడ్డుపై వెళ్తుండగా పక్క నుంచి వాహనాలు వెళ్తే నీరు, బురద పడుతుంది. అలాంటి సమయంలో వాహనదారుడిని, రోడ్లను తిట్టుకుంటూ మనం ముందుకు వెళ్తాం. కానీ ఈ వ్యక్తి మాత్రం అలా వదల్లేదు. తనపై బురద పడటానికి కారణమైన వ్యక్తిని పోలీస్​ స్టేషన్​ మెట్లు ఎక్కించాడు. ఈ ఘటన నిజాంసాగర్ (Nizamsagar) మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది.

కామారెడ్డి డిపోకు (Kamareddy Depot) చెందిన ఆర్టీసీ బస్సు (Bus) శనివారం నిజాంసాగర్‌ మండల కేంద్రం నుంచి వెళ్తోంది. అదే సమయంలో అటుగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ పాదచారుడిపై వర్షపు(బురద) నీరు పడింది. దీంతో సదరు వ్యక్తి, డ్రైవర్​ (Driver)తో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది అయింది. ఇద్దరూ తగ్గకపోవడంతో విషయం పోలీసుల వరకూ చేరింది. ఈ మేరకు ప్రయాణికులతో ఉన్న బస్సును పోలీస్​స్టేషన్ (Police Station)​కు తరలించారు. పోలీసులు ఇరువురిని సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం బస్సును స్టేషన్‌ నుంచి తీసుకెళ్లారు.

అయితే బురదే కాదా అని వదిలేయకుండా గొడవ పెద్దది చేయడం.. డ్రైవర్​ సైతం తగ్గకపోవడంతో ఇక్కడ పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. బస్సును స్టేషన్​కు తరలించి మాట్లాడటంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

DK Aruna comments | ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి: ఎంపీ డీకే అరుణ

ఎమ్మెల్యే కేవీఆర్​పై ఆరోపణలు చేసిన షబ్బీర్​అలీ వాటిని నిరూపించి చూపించాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో కేవీఆర్​ను ఆమె పరామర్శించారు.

Helmet Bank | ఉచితంగా హెల్మెట్.. ఎక్కడో తెలుసా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Helmet Bank | బైక్​పై వెళ్లేటప్పుడు హెల్మెట్​ లేకపోతే పోలీసులు ఫైన్​ వేస్తారు. ఇక్కడ మాత్రం అలా కాదు. ఉచితంగా...

Nizamabad Police Prajavani | పోలీస్​ ప్రజావాణిలో వినతులు స్వీకరించిన సీపీ

పోలీస్​ ప్రజావాణిలో భాగంగా సోమవారం సీపీ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య 30 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం పోలీస్​డ్యూటీ మీట్​లో పతకాలు సాధించిన సిబ్బందిని అభినందించారు.

Harish Rao contractor payments | చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి : హరీశ్​రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao contractor payments | రాష్ట్ర ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని మాజీ మంత్రి హరీశ్​రావు...