అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Case on Dayakar Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుపై కేసు నమోదు అయింది. ఆయనతో పాటు మరో 33 మంది బీఆర్ఎస్ నాయకులపై మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District) తొర్రూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసీఆర్ (KCR)కు సిట్ నోటీసులు, విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో వరంగల్ – ఖమ్మం ప్రధాన రహదారిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సీఎం రేవంత్ (CM Revanth Reddy) దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. BNS 189(2), 223, 126(2), 132, r/w 190 కింద కేసులు పెట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్లు పేర్కొన్నారు.
Case on Dayakar Rao | కీలక ప్రశ్నలు
సిట్ అధికారులు (SIT Officers) మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం నందినగర్‌లోని ఆయన నివాసంలో విచారించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. విచారణ ముగిశాక కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ (Erravalli Farmhouse)కు వెళ్లిపోయారు. అనంతరం కేటీఆర్ మీడిమాతో మాట్లాడారు. సిట్ పేరుతో టైమ్ పాస్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్త చేశారు. కేసీఆర్ సిట్ విచారణ (SIT Investigation) అంతా డ్రామా అన్నారు. చట్టాన్ని సిట్ గౌరవించలేదన్నారు. కేసీఆర్ విచారణకు రావాల్సిన పని లేదని, కానీ చట్టంపై గౌరవంతో విచారణకు హాజరయ్యారని చెప్పారు. కాంగ్రెస్ పెద్దల పైశాచిక ఆనందానికి తెరపడుతుందని భావిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.