అక్షరటుడే, వెబ్‌డెస్క్: OPPO K14x 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ (Smart Phone)ల తయారీ కంపెనీ అయిన ఒప్పో.. బడ్జెట్ ధరలో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యింది. తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఒప్పో కే14ఎక్స్ (OPPO K14x) మోడల్‌ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.14,999 లోపు ఉంటుందని అంచనా. ఈనెల 10న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్(Flipkart)లో అందుబాటులో ఉండనుంది. ఆన్లైన్ ప్లాట్‌ఫాంలలో లీకైన సమాచారం మేరకు ఈ మోడల్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయి.
డిస్ప్లే : 6.75 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో రానుంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 720 * 1570 పిక్సల్స్ రిజల్యూషన్, ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ కలిగి ఉండనుంది.
సాఫ్ట్వేర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అమర్చారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
కెమెరా సెటప్ : వెనకవైపు 50 మెగా పిక్సెల్(MP) ఏఐ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ : 6500 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 45డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
వేరియంట్స్ : పర్పుల్, బ్లూ కలర్స్‌లో లభిస్తుంది.
4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉండనుంది.
బేస్ వేరియంట్ ధర రూ. 14,999లోపు ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.