అక్షరటుడే, కోటగిరి: Kotagiri Mandal | భర్త మృతి చెందిన మరునాడే భార్య చనిపోయింది. ఈ ఘటన కోటగిరి మండలంలోని యాద్గార్పూర్ గ్రామంలో (Yadgarpur village) చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
యాభై ఏళ్ల సంసార జీవితంలో ఆ దంపతులు ఏనాడూ ఒకరినొకరు విడిచి ఉండలేదు. వారికి ఐదుగురు సంతానం కాగా అందులో ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశారు. ముగ్గురు కొడుకుల్లో ఇద్దరికి పెళ్లై వేరే కాపురం పెట్టారు. మరో కొడుకు హైదరాబాద్లో (Hyderabad) ఉన్నా ఆ వృద్ధ దంపతులు ఎవరి దగ్గరా ఉండకుండా ఇద్దరే కాలం గడుపుతున్నారు.
Kotagiri Mandal | నెలరోజులుగా మంచం పట్టిన భర్త
ఈ క్రమంలో గత నెల రోజుల క్రితం అనారోగ్యం పాలైన భర్త సాయిలు(70) మంచం పట్టాడు. ఆయనకు భార్య లచ్చవ్వ(65) సేవలు చేస్తూనే ఉంది. చివరికి ఆరోగ్యం విషమించి మంగళవారం సాయిలు మృతి చెందాడు. బుధవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. అనంతరం గురువారం కార్యక్రమాల్లో భాగంగా మరోసారి కుటుంబీకులు శ్మశానానికి వెళ్లగా అక్కడ సాయిలు భార్య లచ్చవ్వ కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బుధవారం భర్త అంత్యక్రియలు జరగగా గురువారం భార్య అంత్యక్రియలు పూర్తయ్యాయి.