అక్షరటుడే, వెబ్డెస్క్ : Prakasam District | తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో బొలెరో వాహనం (Bolero Vehicle)లో మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ప్రకాశం జిల్లా రాచర్ల రంగారెడ్డి పల్లె వద్ద అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. తుని నుంచి జీడిపప్పు లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొంది. దీంతో బొలెరోలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్ అనంతపురం జిల్లా (Anantapur District)కు చెందిన వెర్రి స్వామి సజీవ దహనం అయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో మరో వ్యక్తి గాయపడగా.. పోలీసులు గిద్దలూరు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడిని అనంతపురం జిల్లాకు చెందిన జయరామి రెడ్డిగా గుర్తించారు.
Prakasam District | హైదరాబాద్లో..
హైదరాబాద్ నగరంలోని బాలానగర్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఐడీపీఎల్ సమీపంలోని డిమార్ట్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై నుంచి గుర్తు తెలియని వాహనం దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Prakasam District | ట్రాఫిక్ హోంగార్డును ఢీకొని పరారు
హైదరాబాద్ మాదాపూర్లో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయింది.ట్రాఫిక్ హోంగార్డును కారుతో ఢీకొట్టి నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనలో హోంగార్డు నయీంకు తీవ్ర గాయాలయ్యయి దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.