అక్షరటుడే, వెబ్డెస్క్: Saudi Arabia | ఎడారి దేశం సౌదీలో మంచు దుప్పటి కప్పేసింది. వాతావరణంలో మార్పులతో అక్కడ రెండు రోజులుగా మంచు కురుస్తోంది. దీంతో రోడ్లు, ఖాళీ ప్రదేశాలు మంచుతో నిండిపోయాయి.
సౌదీ అరేబియాలో ఈ వారం మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. ఖాసిమ్, టబుక్, ఉత్తర రియాద్ ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. ఇతర ప్రాంతాలలో ఉరుములు, వడగళ్ల వాన, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో మంచు దుప్పటి కప్పేసింది. దీంతో మంచును చూస్తూ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు.
Saudi Arabia | హిమపాతంతో..
సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతాలలో హిమపాతం (Snowfall) చోటు చేసుకుంది. దీంతో రోడ్లపై మంచు కప్పేసింది. అధికారులు రోడ్లపై మంచును తొలగించి వాహనాల రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేశారు. కొండ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు (Temperatures) సున్నా డిగ్రీల కంటే తక్కువగా పడిపోయాయి.
ప్రముఖ సౌదీ ఖగోళ శాస్త్రవేత్త మాట్లాడుతూ, ఇటువంటి హిమపాతం సంఘటనలు విస్తృత దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ, శీతాకాలంలో అసాధారణం కాదని అన్నారు. ప్రతి శీతాకాలంలో ఇక్కడ మంచు కురుస్తుందన్నారు. డిసెంబర్– ఫిబ్రవరి మధ్య హిమపాతం సాధారణంగా నమోదవుతుందని పేర్కొన్నారు. తబుక్లోని జబల్ అల్ లాజ్, అలకాన్, అల్ ధార్, అల్ జౌఫ్లోని సకాకా, డుమాత్ అల్ జండాల్, అరర్, హెయిల్లోని జబల్ అజా, జబల్ సల్మా, అసిర్లోని అభా ఎత్తైన ప్రాంతాలు హిమపాతం ఎక్కువగా ఉంది.