అక్షరటుడే, కామారెడ్డి: Additional Collector Chander Nayak | మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అన్నారు. కామారెడ్డి(kamareddy) పట్టణంలోని మహిళా సమాఖ్య భవనంలో (Women’s Federation Building) మహిళా శక్తి ప్రగతిపై సోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు సంఘాలలో లేని 8,800 మంది మహిళలను గుర్తించి సంఘాలలో చేర్పించడం జరిగిందన్నారు. మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళా సంఘ సభ్యులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టించడం ద్వారా వారికి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. 183 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాలకు అప్పగించి.. వారి ద్వారా రూ.3కోట్ల విలువ గల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు.
పాడి గేదెలు, మదర్ యూనిట్స్, పెరటి కోళ్ల పెంపకం, పాల ఉత్పత్తుల కేంద్రాలు, మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా శక్తి (mahila Shakthi) కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రస్తుతం భవనం నిర్మాణంలో ఉందని చెప్పారు. 2025-26 సంవత్సర కార్యచరణ ప్రణాళికలో భాగంగా పెట్రోల్ బంకులు, గోదాములు, రైస్ మిల్లులు (Rice Mills), ఆర్టీసీ బస్సుల నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సురేందర్, అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీఎంలు, స్త్రీనిధి ఆర్ఎం, ఏపీఎంలు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పుష్ప, కార్యదర్శి, రాజమణి, కోశాధికారి లక్ష్మి, ఆయా మండల సమాఖ్యల అధ్యక్షులు పాల్గొన్నారు.
